కర్ణాటక ప్లాన్ తెలంగాణలో సక్సెస్ అవుతుందా..!!
సునీల్ కానుగోలు బి ప్లాన్ తెలంగాణలో వర్క్ అవుట్ అవుతుందా..!! పక్క ప్లాన్ తో తెలంగాణ ప్రభుత్వం సునీల్ ను అరెస్టు చేసి కాంగ్రెస్ కు చెక్ పెట్టనుందా..?
వెంకగారి భూమయ్య సీనియర్ జర్నలిస్ట్ వర్తమాన రాజకీయాలపై విశ్లేషణ
(తెలంగాణలో టిఆర్ఎస్, బిజెపి పార్టీలలో అంతర్మధనం మొదలయ్యింది. అసంతృప్తిగానే అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి వరకు దిగజారింది అని చెప్పాలి. రెండు పార్టీల లో స్వరం మార్చారు. ఒక్క గెలుపు తెలంగాణలో ఉక్కిరిబిక్కిరి చేస్తుందని చెప్పాలి, హుటాహుటిన ఢిల్లీ చేరిన ఈటెల రాజేందర్ అధిష్టానం దగ్గర తన గోడు ఎలా వెళ్లబోసుకున్నాడో కానీ తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణ పై చర్చ జరిగిందని చెప్పాలి. కెసిఆర్ కూడా సంతృప్తిలో ఉన్న నాయకులను మంచి చేసుకునేందుకు పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకొని వంద నుంచి 90 సీట్లు సాధిస్తున్నామని నాయకులలో జోష్ పెంచే ప్రయత్నం చేశారు. అంటే కర్ణాటక ప్రభావం తెలంగాణ పై పడుతుంది జాగ్రత్తగా ఉండండి. ఇటు బిజెపికి అటు టీఆర్ఎస్ కు ఎక్కడో భయం పట్టుకుందని చెప్పాలి. ఈ పరిస్థితులను అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ మలుచుకుంటుందో లేక పార్టీలో అంతర్గత కొట్లాటలు పెట్టుకుంటుందో చూడాలి. ఏదేమైనా కర్ణాటకలో ఏ ప్లాన్ పాస్ అయితే తెలంగాణలో బి ప్లాన్ పాస్ అవుతుందా..!? రాజకీయ పరిస్థితులు ఎలా మారుతున్నాయో రెండు నెలల్లో ఎన్నికల వేడి పెరగనున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు దక్షిణ భారతంలో బిజెపికి గడ్డికాలమని చెప్పుకోవాలి. ఏది ఏమైనా బిజెపికి నాలుగు మూడో స్థానానికి పరిమితం కాను ఉందని చెప్పకనే చెప్పాకోవాలి. ముఖ్యంగా అధికార పార్టీలో మరింత భయం పట్టుకుందని చెప్పుకోవాలి ఇంట గెలిచి రచ్చ గలవాలనే సామెత కెసిఆర్ గుర్తు చేసుకోవడమే. దీనికి నిదర్శనం. ఇక బిజెపిలో కూడా గ్రూప్ రాజకీయాలు ఎక్కువగా కావడం కాంగ్రెస్కు అనుకూలంగా మారుతుందని చెప్పుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో మరి కాంగ్రెస్ పుంజుకుంటుందా.. మళ్లీ టిఆర్ఎస్ అధికారం చేపడుతుందో వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రశాంత్ కిషోర్ అంటేనే( పికే) తెలంగాణలో ఓ బ్రాండ్ గా ముద్ర పడింది కేసీఆర్ కు పక్క ప్లాన్ సర్వే చేసి జాతీయ పార్టీ ఏర్పాట్లు లో క్రియ శీలకంగా సూచనలు చేయడంతో పాటు సర్వేలు నిర్వహించారు. అనేది అందరికీ తెలిసిందే. కెసిఆర్ కు ప్రశాంత్ కిషోర్ కి మధ్య జరిగిన లావాదేవీలు లేక ఏ రకమైన విభేదాలు ఏర్పడిందో కానీ తెలంగాణ నుండి ప్రశాంత్ కిషోర్ బయటకు పోవడంతో ఆయన శిష్యుడు కానుగోలు సునీల్ పక్క ప్లాన్ తో కాంగ్రెస్ పార్టీకి ఓ స్కెచ్ వేసి సోషల్ మీడియా ద్వారా కెసిఆర్ అవినీతిని ,అక్రమాలను ప్రచారం చేపట్టిన నేపథ్యంలో ఎక్కడ కాంగ్రెస్ పార్టీ బలపడుతుందోనని భయంతోనే కెసిఆర్ సునీల్ ని అరెస్ట్ చేయించారనే చెప్పాలి. కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున తెరకింద కీలక పాత్ర పోషించి, క్రియాశీలకంగా వ్యవహరించారని, తెలంగాణలో కూడా అదే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లే అవకాశం లేకపోలేదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో. కర్ణాటక ఎన్నికలను గమనించిన కేసీఆర్ హుటాహుటిన రాష్ట్ర కాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ ,బిజెపిని పట్టించుకోకుండా టిఆర్ఎస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి 95 నుంచి 110 సీట్లు గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు.అలాగే బిఆర్ ఎస్ పార్టీ నాయకులకు కెసిఆర్ దిశా నిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. కర్ణాటక రాష్ట్రంలో ఏ రకంగా అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు విభేదాలు విడిచి పార్టీ గెలుపుకు పునాది వేసుకున్నారో అదే రకంగా తెలంగాణలో కూడా కలిసి పార్టీ గెలుపుకు పునాది వేసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిమగ్నమయ్యారని వీటన్నిటిని గమనిస్తున్న కేసీఆర్. ఎప్పటికప్పుడు పార్టీ నాయకులను అలర్ట్ చేస్తూ సమీక్ష సమావేశం నిర్వహిస్తూ. ఆత్మీయ సమ్మేళనలతో ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. నియోజవర్గంలో ఎవరైతే నిర్లక్ష్యం వయిస్తారో వారికి పార్టీ టికెట్ ఇవ్వరు అనే బెదిరింపులకు గురి చేసే ప్రయత్నం కెసిఆర్ చేస్తున్నరని చెప్పాలి. ఒక కర్ణాటక గెలుపు దేశం మొత్తాన్ని కుదిపేసిందనే చెప్పాలి. ఇటు బిజెపి పార్టీని ఇటు టిఆర్ఎస్ పార్టీ నాయకులను తలకిందుల చేస్తూ దక్షిణ భారతదేశంలో ఇక బిజెపి పార్టీకి అవకాశం లేదనే చెప్పాలి. ఈ పరిస్థితులలో ఇటు బిజెపి అటు టిఆర్ఎస్ ఏ రకంగా కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవాలో పక్క ప్లాన్ వేస్తున్నారని చెప్పాలి ఒకవేళ సునీల్ కానుగోలు తెలంగాణలో కార్యక్రమాలను చేయకుండా అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తూనే, కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యక్రమాలు ఎవరైతే చేపడుతున్నారో వారిపై ఉక్కుపాదం మోపే విధంగా పోలీసులపై ఒత్తిడి చేస్తున్నారని చెప్పాలి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరఫున సునీల్ కనుగోలు పనిచేస్తున్నారని ఎన్నికలకు కొన్ని నెలల మాత్రమే టైమ్ ఉండడంతో ఇప్పటికే కాంగ్రెస్ను గెలిపించేలా ఎన్నో సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారని చెప్పాలి. సునీల్ టీం పొంగులేటి, జూపల్లి తోను చర్చ జరిపి కాంగ్రెస్లో చేరాలని కోరింది. సునీల్ టీం తెలంగాణ సర్కార్ పై అసత్య ప్రచారం చేస్తుందని ఇటీవల కేసు కూడా పెట్టింది కర్ణాటక ఎన్నికలు ముగియడంతో సునీల్ కనుగోలు ఇప్పటినుంచే తెలంగాణ ఎన్నికల పైన పూర్తి స్థాయిలో నజర్ పెడుతున్నారని ప్రచారం ఉండడంతో కాంగ్రెస్ పార్టీని సునీల్ కానుగోలను గెలిపించాలని ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. కర్ణాటకలో అనుసరించిన ఫార్ములా సక్సెస్ కావడంతో దాన్నే తెలంగాణలోనూ అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తుందని, ఇప్పటినుండే కాంగ్రెస్ నాయకులు కలిసి పార్టీ గెలుపుకు వ్యూహం రచించాలని. అధిష్టానం సీనియర్ కాంగ్రెస్ నాయకులకు సూచనలు చేసిందని చెప్పాలి. సమిష్టిగా కాంగ్రెస్ పార్టీ గెలుపుకు పునాది వేసుకోవాలని బిజెపి ,టీఆర్ఎస్ ను ఓడించే దిశగా ఇప్పటినుండే కాంగ్రెస్ పార్టీ తరఫున అమలు చేసే పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని అధిష్టానం ఆదేశించిందట.
కర్ణాటక ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తుందనే చెప్పాలి. ఎలాగైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలని సామెత అలాగే కేసీఆర్ కూడా తెలంగాణలో 95 నుంచి 100 సీట్లు గెలిచి జాతీయస్థాయిలో టిఆర్ఎస్ పార్టీని విస్తరించాలని భావనలో ఉన్నారని అందుకు కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా ముందుకు పోకుండా ఎలాగైనా అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తారనే విమర్శలు లేకపోలేదు. బిజెపి టిఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ కు ఎదగనివ్వద్ద నే ఆలోచన, ఏ రకంగా అయినా కాంగ్రెస్ పార్టీ నీ బలపడకుండా కాంగ్రెస్ నాయకులను ఏ విధంగా కొనుగోలు చేయాలని ఆలోచనలో టీఆర్ఎస్ ,బిజెపి పక్క ప్లాన్ చేస్తుందని చెప్పాలి కానీ ఒక సారి కర్ణాటకలో బంపర్ మెజారితో గెలవడంతో రెండు పార్టీల ప్లాన్ పక్కాగా బెడిసి కొట్టింది.
ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు గమనించి టిఆర్ఎస్ పార్టీని ఎలా అడ్డుకోవాలో సమిష్టిగా ఎలా ముందుకు పోవాలననేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది..?! ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు అధికారం రాకుండా బిజెపి టీఆర్ఎస్ సమిష్టి ప్లానట..
కర్ణాటక గెలుపుతో బిజెపిలో కూడా ఎవరు చేరే పరిస్థితి కనిపించట్లేదు టిఆర్ఎస్ పరిస్థితి కూడా అదే విధంగా ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ టిఆర్ఎస్ బిజెపిలో ఉండదని ఆర్ఎస్ఎస్ చెప్పిన విధంగానే నడుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఇతర పార్టీ నాయకులలో భయం పట్టుకుంది. చూడాలిమరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ అడ్డుకుంటారా 95 నుంచి 100 సీట్లు సాధించుకుంటారా… లేక కాంగ్రెస్ పార్టీ గెలుపుకు సహకరిస్తారా …కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఏ రకంగా సద్వినియోగం చేసుకుంటారో చూడాలి.