Saturday , October 5 2024

51వ జీవోను రద్దుచేసి కనీస వేతనం అమలు చేయాలి

యూనియన్ రాష్ట్ర కార్యదర్శి బింగి గణేష్

తెలంగాణ కెరటం చిగురుమామిడి మండల ప్రతినిధి జులై 26

గ్రామ పంచాయతి సిబ్బంది మరియు కారోబార్ బిల్ కలెక్టర్ సమస్యలపై గత 21 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి 51వ జివోను రద్దు చేసి కనీస వేతనం 19500 రూపాయాలు అందరి సిబ్బందికి ప్రభుత్వ ఖజానా నుండి నేరుగా సిబ్బంది మొక్క బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని మల్టీ పర్పస్ విధానాన్ని తోలగించి ఏవరి కేటగిరిల వారిగా వారికి హోదాలు కల్పంచాలని ఉద్యోగ భద్రత కల్పించి ప్రమాదవశాత్తు ఎవరయినా మరణించినట్లయితే ప్రభుత్యమే 10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించి వారి కుటుంబం లో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని కారోబార్లకు మరియు బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శిగా నియమించాలనీ చిగురుమామిడి మండలంలోని అన్ని గ్రామాల గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు ప్రభుత్వం గ్రామ పంచాయతి సిబ్బంది సమస్యలు పరిష్కరించే వరకు సమ్మే కొనసాగిస్తామని తెలుపారు. ఈ సమ్మెలో తెలంగాణ గ్రామ పంచాయతి కరోభార్ సిబ్బంది యూనియన్ రాష్ట కార్యదర్శి బింగి గణేష్ మండల అధ్యక్షులు వేల్పుల రాములు, జిల్లా అధ్యక్షులు మారెల్ల రాజేష్ కరోభార్లు శంకర చారీ శంకర్ బాబు సాంబయ్య రాజేశం అనిల్ జయ అందరూ ఈ సమ్మెలో పాల్గొన్నారు.