తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి మార్చి 31
బహుజన చక్రవర్తి సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 314 వ వర్ధంతి ఉత్సవాలను ఏప్రిల్ 2వ తేదీన మంగళవారం ఊరూరా ఘనంగా నిర్వహించాలని జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా గౌరవ అధ్యక్షులు బంబోతుల లింగా గౌడ్, జిల్లా అధ్యక్షులు మురళి గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అంకన్న గారి శ్రీనివాస్ గౌడ్ లు పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జై గౌడ కార్యాలయంలో ఆదివారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బహుజనుల ఆరాధ్య దైవం ఛత్రపతి శివాజీ సమకాలికులు, అనాటి నిరంకుశ రాజరికపు పాలకులకు వ్యతిరేకంగా బడుగు, బలహీన వర్గాలను ఏకం చేసి గోల్కొండ కోట తో పాటు తెలంగాణ ప్రాంతంలో సుమారు 32 కోటలను జయించి బడుగు బలహీనవర్గాలకు రాజ్యాధికారాన్నీ అందించిన భారతదేశపు తొలి గొప్ప బహుజన చక్రవర్తి సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు. రవి అస్తమించని ప్రపంచాన్ని పాలించిన అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం చే గొప్పగా కీర్తించబడిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర మరియు విగ్రహం లండన్ లో ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ లో భద్రపరచి గౌరవించబడుతున్నదన్నారు. ఏప్రిల్ 2న గ్రామ గ్రామాన గౌడ సామాజిక వర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, గౌడ కులస్తులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జై గౌడ ఉద్యమం జిల్లా నాయకులు ఎల్లారెడ్డి ప్రశాంత్ గౌడ్, అంకన్న గారి నాగరాజ్ గౌడ్, ఇందూరి సిద్ధా గౌడ్, కరోల శేఖర్ గౌడ్, పెద మల్లారెడ్డి సుదర్శన్ గౌడ్, ఫ్లెక్సీ ప్రశాంత్ గౌడ్, కోనాపూర్ స్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.