Saturday , October 12 2024

సంపద కలిగిన రాష్ట్రం తెలంగాణ.

నేడు అప్పుల కుప్పగా మార్చిన ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు.

తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన ప్రతినిధి ఆగస్టు 10:

తెలంగాణ రాష్ట్రంలో పైరవీలు చేసిన వారికే ఉద్యోగాలు.నిరుద్యోగులు పరీక్షలు రాస్తే 15 సార్లు లీకులు చేసి విద్యార్థుల పొట్ట కొట్టిన ముఖ్యమంత్రి.

బిజెపి ఎమ్మెల్యే, కేంద్ర ప్రధాన కార్యదర్శి ఈటల రాజేందర్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపణలు.బిజెపి పార్టీలో మెదక్ జిల్లా నిజాంపేట మండలం జెడ్పిటిసి సభ్యుడు పంజా విజయ్ కుమార్ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు.తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల కుప్పగా మార్చిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు అని బిజెపి ఎమ్మెల్యే, కేంద్ర పార్టీ కార్యదర్శి ఈటెల రాజేందర్ అన్నారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావులు మాట్లాడుతూ తెలంగాణను పూర్తిగా అభివృద్ధిలో నాశనం చేసిన వ్యక్తి చంద్రశేఖర రావు కుటుంబం అన్నారు. అంతకుముందు నిజాంపేట జెడ్పిటిసి సభ్యుడు పంజా విజయ్ కుమార్ కు శాలువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సంపాదన రాష్ట్రమని దాన్ని అప్పుల కుప్పగా చేయడం సిగ్గుచేటు అన్నారు. రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశా నిర్వహించడం జరిగిందని అసెంబ్లీలో తాను ఎమ్మెల్యే నాని చూడకుండా ఈటెల రాజేందర్ ను దూషించడం జరిగిందని అన్నారు. లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి నిరుపేద ప్రజల అభివృద్ధి చేసింది ఏమీ లేదని వారు ఆరభించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిరుపేదలకుండా బడా నాయకులకు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం లక్షల కోట్ల రూపాయలు ప్రవేశపెట్టి అందులో లక్షలు తెలిపారు. మరో మూడు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ రావడం జరుగుతుందని అందులో ప్రజలు తీర్పు చెప్పాలని ఆయన కోరారు. నేడు రాష్ట్రంలో ఉద్యోగాలు లేక ఉన్నతమైన చదువులు చదివి కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నారని నిరుపేదల ఉసురు కెసిఆర్ ప్రభుత్వానికి ఘాటు ఆరోపించారు. తొమ్మిది సంవత్సరాల్లో 35 వేల ఇండ్లు నిర్మించిన దాత నరేంద్ర మోడీ అన్నారు. కుల మతాలు తేడా లేకుండా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కానీ గ్రామాల్లో కార్యకర్తలకు మాత్రమే మూడు లక్షల రూపాయలు ఇండ్లను మంజూరు చేయడం జరుగుతుందని ఆరోపించారు. వీటికోసం కోకాపేట భూముల నమ్మి లక్షల కోట్లు గడిస్తున్నారని ఆరంభించారు. పంట నష్టపోయిన రైతులకు ఇప్పటివరకు నష్టపరిహారం ఇవ్వలేదని ఈటల రాజేందర్, రఘునందన్ రావులు ఆరోపించారు. మూడుసార్లు పంట నష్టపోయిన విషయాన్ని కొంతమంది రైతులు హైకోర్టులో దరఖాస్తు చేయగా తెలంగాణ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు వెళ్లి రైతులకు నష్టపరిహారం రాకుండా చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి సమావేశంలో ముందుగానే మాట్లాడుతూ తన ముందు గజకర్ణ, గోకర్ణ, టౌన్ టమారం కథలు చేయరాదని ఎదవ చేయడం ఆయన అలవాటుగా మారిందన్నారు. దళితులకు 10 లక్షల రూపాయలు ఇస్తానని ఇవ్వడం లేదన్నారు. బీసీ కులాలకు మాత్రం బీసీ బందు ఇవ్వడం లేదని అన్నారు. బిజెపి అధికారంలోకి వస్తే ఇంట్లో ఇద్దరి వృద్ధులకు పింఛన్లు ఇస్తామని వారు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లాల విజయ్ కుమార్, సుధాకర్ రెడ్డి, నందా రెడ్డి, తాళ్లపల్లి రాజశేఖర్, వీరయ్య యాదవ్, నందు జనార్దన్ రెడ్డి, బెండే వీణ, జిల్లా రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.