Wednesday , September 18 2024

వ్యవసాయ మార్కెట్లో రైతులకు మధ్యాహ్న భోజనం ప్రారంభించిన ఎమ్మెల్యే.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (ఫిబ్రవరి 18):

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో రైతులకు సిబిఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆదివారం అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ లో వేరుశనగ పంటను రైతులు మార్కెట్కు తీసుకొచ్చి కొనుగోలు చేస్తున్న క్రమంలో మధ్యాహ్నం భోజనం కార్యక్రమం రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని వారికి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం సిబీయం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. వ్యాపారులతో కలిసి మార్కెట్ కు వచ్చిన రైతుల తెచ్చిన వేరుశనగ పంటను పల్లి ఆవుటం బట్టి ధర నిర్ణయించి న్యాయం చేయాలని కాంటాక్ట్ ఏ విధంగా చూడాలని మార్కెట్ అధికారులకు వ్యాపారులకు సూచించారు
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ అధికారులు ప్రజాప్రతినిధులు, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.