Wednesday , July 24 2024

వర్కింగ్ జర్నలిస్ట్ ల ఇళ్లస్థలాల పై ఎమ్మెల్యే సానుకూల స్పందన.

తెలంగాణ కెరటం మద్దూరు ప్రతినిధి ఆగస్టు (11)

దూల్మిట్ట మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెక్ డ్యామ్ వంతెన నిర్మాణ కార్యక్రమాలకు విచ్చేసిన స్థానిక జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని ఉమ్మడి మద్దూరు,ధూళిమిట్ట మండలాల జర్నలిస్ట్ లు తమకు ఇండ్ల స్థలాలను కేటాయించి డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేయాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని కోరాగ దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే వర్కింగ్ జర్నలిస్ట్ ల అందరికీ కూడా ఇండ్ల స్థలాలను కేటాయిస్తామని హామీ ఇచ్చారు.దీనిపై వర్కింగ్ జర్నలిస్ట్ లు అందరూ ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు