Wednesday , July 24 2024

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన మంజులరెడ్డి…

 తెలంగాణ కెరటం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల ప్రతినిధి ఆగస్టు

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం లంబాడిపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన మంద పోశయ్య అనారోగ్యంతో మృతిచెందిన విషయం గ్రామస్తులు సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డికి తెలపగా శుక్రవారం వారి కుటుంబ సభ్యులును మంజుల రెడ్డి   పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.అనంతరం వారి కుటుంబ సభ్యులుకి 5వేల రూపాయల ఆర్థిక సహాయం అందచేశారు.కష్టాల్లో ఉన్న నిరుపేద కుటుంబానికి సహాయం అందించిన మంజులరెడ్డికి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.వీరి వెంట కాటం సంపత్ రెడ్డి,హనుమండ్ల కనక రెడ్డి, కర్ర అశోక్ రెడ్డి, ఐరెడ్డి రాజిరెడ్డి,చందబోయిన శ్రీనివాస్, మంజులక్క యువసేన హుస్నాబాద్ నియోజకవర్గ బాధ్యులు ఏగురి రవీందర్ రెడ్డి, యువసేన సభ్యులు తదితరులున్నారు.