Wednesday , July 24 2024

ఫ్రెషర్ డే వేడుకలలో విషాదం

డాన్స్ చేస్తూ కుప్పకూలిన విద్యార్థిని

ఆసుపత్రి కి తరలిస్తుండగా మార్గమధ్యం లో మృతి 

తెలంగాణ కెరటం ప్రతినిధి

న్యూస్ డెస్క్

ఆగస్టు:-11

“స్టేజ్ మీద డాన్స్ చేస్తూ ఒక్కసారిగా విద్యార్థిని కుప్పకూలి ప్రాణాలు విడిచిన హృదయ విదారక ఘటన గంగాధర మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. శుక్రవారం గంగాధర మోడల్ స్కూల్లో ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ క్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు సంతోషంగా వేడుకల్లో మునిగిపోయారు. వేదికపై డాన్స్ చేస్తున్న ఇంటర్ సెకండియర్ విద్యార్థిని ప్రదీప్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో విద్యార్థినిని వెంటనే గంగాధర ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించాలని అక్కడి వైద్యులు సూచించారు.దీంతో విద్యార్థినిని హుటాహుటిన కరీంనగర్ తరలిస్తన్న క్రమంలో మార్గమధ్యలోనే తనువు చాలించింది. మండల పరిధిలోని వెంకటరావుపల్లి గ్రామానికి చెందిన గూడు అంజయ్య కూతురు ప్రదీప్తి కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుందని స్థానికులు తెలిపారు. ప్రదీప్తి ఉన్నట్టుండి ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోదించారు. ప్రదీప్తి మరణించిందనే విషయం తెలిసిన పాఠశాల ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు జీర్ణించుకోలేకపోతున్నారు