Saturday , October 5 2024

ప్రొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అధికారులు.

తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి ఏప్రిల్ 19:

మెదక్ జిల్లా రామాయంపేట స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో మార్క్ఫెడ్ మెదక్ ప్రాథమిక సహకార సంఘం రామాయంపేట ఆధ్వర్యంలో ప్రొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని సహాయ వ్యవసాయ సంచాలకులు వసంత సుగుణ, సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్టర్ పండిత్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు రాజ్ నారాయణ, సతీష్, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు మార్క్ఫెడ్ అధికారి తిరుపతి, ప్రాథమిక సహకార సంఘం సీఈవో నర్సింలు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు కనీస నాణ్యత ప్రమాణాలు పాటించి కనీస మద్దతు ధర 6,760 క్వింటాల్ కు పొందే అవకాశం ఉంది జిల్లా వ్యాప్తంగా రెండు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఒకటి శంకరంపేట్ (ఏ) రామయంపేట నందు శుక్రవారం ప్రారంభించబడిందని జిల్లావ్యాప్తంగా 381 ఎకరాల్లో 3048 క్వింటాళ్ల ప్రొద్దుతిరుగుడు పంట వచ్చే అవకాశం ఉందని తెలిపారు. రైతులు తప్పనిసరిగా తమ పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్, బ్యాంకు ఖాతా, వివరాలతో పాటుగా పంట ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుందని తెలిపారు.