Monday , September 16 2024

ప్రజలు బుద్ది చెప్పే రోజులు దగ్గర పడ్డాయి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి.

ప్రజలు బుద్ది చెప్పే రోజులు దగ్గర పడ్డాయి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి.

తెలంగాణ కెరటం మద్దూరు మండల ప్రతినిధి జూన్(28)

మద్దూరు మండల కేంద్రంలో ఎంపీపీ బద్దీపడగా కృష్ణరెడ్డి,బీఆర్ఎస్ పార్టీ మండలాల అధ్యక్షులు మేక సంతోష్,మంద యాదగిరి అద్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్నరు.ఈ ప్రాంతంలో ఉండి ఈ ప్రాంతానికి ఎలాంటి సేవ చేయని ఒక వ్యక్తి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి,ఆ వ్యక్తి పేరు చెప్పాలంటేనే సిగ్గనిపిస్తుంది ఆ వ్యక్తి గతంలో ఇక్కడ జనగామ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పని చేసి ఈ నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధి చేయకుండా ఉండి ఈ నియోజకవర్గంలో ఎక్కడ తిరగకుండా ఉండి ప్రజల యోగక్షేమాలు తెలుసుకొనీ వ్యక్తి అని
జనగామ నియోజకవర్గ ప్రజలందరికీ అర్థమైంది అని అన్నారు.
ప్రతాపరెడ్డి అనే వ్యక్తి జనగామ నియోజకవర్గంలో అరిగిపోయిన వ్యక్తి ప్రజాసేవ అవసరం లేని వ్యక్తి అని అన్నారు.
ముత్తిరెడ్డి విషయానికి వస్తే ప్రజాక్షేత్రంలో నిరంతరం గెలిచినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం సాధించక ముందు నుంచి కెసిఆర్ వెంటనే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తరువాత జనగామ నియోజకవర్గానికి రెండోసారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ జనగామ నియోజకవర్గం ప్రజాక్షేత్రంలో మళ్లీ ఎమ్మెల్యేగా ఓడించలేము అనే కుట్రతో తన సొంత ఇంట్లో సంత బిడ్డను అమాయకురాలైన బిడ్డను రెచ్చగొట్టి ప్రతాప్ రెడ్డి ప్రతాప్ రెడ్డి కొడుకులు అల్లుడు ఇంట్లో చిచ్చుపెట్టి ప్రజాక్షేత్రంలో బదనాం చేద్దామనే కుట్రలు మానుకోవాలి అన్నారు. పట్టా భూమిని కొనుక్కొని తన బిడ్డ పేరు మీద పట్టా చేపిస్తే ఆ బిడ్డను రెచ్చగొట్టి ప్రజాక్షేత్రంలో బదనాం చేస్తామని చూస్తూన్నారు జనగామ ప్రజలు ఇప్పటికే నీకు బుద్ధి చెప్పారు ఈ ప్రాంత ప్రజలు నిన్ను తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి అని అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు బాల్ రెడ్డి,సర్పంచులు జనార్దన్ రెడ్డి,సుదర్శన్,ప్రాధమిక వ్యవసాయ శాఖ వైస్ ఛైర్మన్ ఇర్రి రాజిరెడ్డి,నాయకులు చంద్రమౌళి, ఇమ్మడి సంజీవరెడ్డి, సాయిలు,యూత్ అధ్యక్షులు బడుగు సాయిలు,గూడ రవీందర్,టిఆర్ఎస్వీ అధ్యక్షుడు పోతుగంటి రవీందర్,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.