Thursday , May 23 2024

పాత్రికేయుడికి మండలి విప్ కౌశిక్ రెడ్డి పరామర్శ

తెలంగాణ కెరటం హుజురాబాద్ ఆగస్టు

 హుజురాబాద్ నమస్తే తెలంగాణ ఆర్సి ఎన్నో చార్జ్ గూడూరి కొండల్ రెడ్డి తండ్రి గూడూరి గోపాల్ రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా కొండాల్ రెడ్డిని శాసనమండలి విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు. గోపాల్ రెడ్డి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతూనే ఇంటివద్ద మృతి చెందారు. కొండల్ రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించి గోపాల్ రెడ్డి మృతి చెందిన తీరును కౌశిక్ రెడ్డి అడిగి తెలుసుకుని కొండల్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన వెంట టిఆర్ఎస్ పార్టీ పట్టణ మండల శాఖ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, డాక్టర్ సంగెం ఐలయ్య, కౌన్సిలర్ ఎం కుమార్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు సురేందర్ రెడ్డి నరేష్ మొలుగురి ప్రభాకర్ గోవిందుల భాస్కర్, సామల రాజారెడ్డి, మొలుగు పూర్ణచందర్, అఖిల్ గౌడ్, పాత్రికేయులు తిరుపతి గౌడ్, నంబి భరణి కుమార్, ముష్కె శ్రీనివాస్ తదితరులున్నారు.