Tuesday , July 16 2024

నిన్న కిక్కిరిసిన జనం నేడు వేలవేల పోతున్న తాసిల్దార్ కార్యాలయం.

తెలంగాణా కెరటం.మక్తల్.

మక్తల్ తాసిల్దార్ ఆఫీసులో గత మూడు రోజులుగా గృహలక్ష్మి దరఖాస్తుల సమర్పణ తో  కార్యాలయంలో జనంతో గొలగొల ఉండగా దరఖాస్తుల గడువు తీరడంతో జనంలేక వేల వేలపోయింది. సొంత ఇళ్ళు లేని వారికోసం రాష్ట్ర ప్రభుత్వం గృహ లక్ష్మి పథకాని ప్రవేశపెట్టి అర్హత కలిగిన మహిళలు దరఖాస్తులు చేసుకోవాలని మూడు రోజుల గడువు ఇవ్వండంతో మండలంలోని 32 గ్రామ పంచాయితిలోని ఇళ్ళు లేని బాధితులు  దరఖాస్తు చేసు కోవడానికి మక్తల్ కేంద్రానికి రావడంతో జిరాక్స్ సెంటర్లు. మీసేవ కేంద్రాల వద్ద జనంతో కిటకిటలాడింది.పది తేది సాయంత్రం గడువు తీరడంతో మక్తల్ తాసిల్దార్ కార్యాలయం జనం లేక బొసిపొయింది.