.
జిల్లా ఎన్నికల అధికారి రాజర్షి షా .
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి ఆగస్టు
శుక్రవారం స్థానిక క్రిస్టల్ గార్డెన్ లో ఓటర్ జాబితా తయారీ ఆగష్టు 21 న ముసాయిదా ప్రచురణ లో భాగంగా బి ఎల్ ఓ లు, సూపర్ వైజర్లతో మెదక్ నియోజక వర్గ స్థాయి శిక్షణ , సమీక్షమావేశం నిర్వహించారు. ఈ కార్య క్రమమానికి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ 01 అక్టోబర్ 2023, బి ఎల్ ఓ ల పరిధి లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరుని కచ్చితంగా ఓటర్ నమోదు చేయాలని బి ఎల్ ఓ లను ఆదేశించారు 19 సంవత్సరాలు నిండిన ఓటర్ నమోదు 3 శాతం కంటే అధికంగా నమోదు చేయాలన్నారు.మహిళలు పెళ్లి చేసుకొని ఇతర గ్రామాలకు వెళ్లినా ఆగ్రామాలలో ఓటర్ నమోదు చేసుకోవాలన్నారు.ఓటర్ నమోదుకు , కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ పతాకానికి ఎటువంటి సంభందం లేదని తెలిపారు.18-19 సంవత్సరాలు నిండిన ఓటర్ల నమోదు తక్కువ గా ఉన్నందున ఇంటింటి సర్వే చేయాలని అన్నారు .ప్రత్యేక అవసరాల ఓటర్ల నమోదు కు జాగ్రత వహించాలన్నారు.ఆగష్టు 26,27 , సెప్టెంబర్ 02,03 తేదీల లో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాలు వుంటాయని సంబంధిత బి.ఎల్ .ఓ లు తప్పనిసరిగా తమ పోలింగ్ స్టేషన్ ల వద్దనే వుండాలని అక్కడే ఫారం 6,7,8 నమోదుచేసి స్వీకరించాలని అన్నారు . ముసాయిదా ప్రచురణ ప్రతులను గ్రామా పంచాయతీ , పోలింగ్ స్టేషన్లలో ఓటర్లకు అందుబాటులో ఉంచాలని తెలిపారు . ముందురోజు గ్రామంలో చాటింపువేయించాలని అన్నారు. ఫారం 6 కొత్త ఓటర్ల నమోదు ,7 మరణించిన వారి వివరాలు , ఫారం 8 మార్పులు చేర్పులు నమోదు చేసేటప్పుడు జాగ్రత్తవహించాలని అన్నారు. ఒకే కుటుంబ సభ్యుల ఓటర్ల జాబితా ఒకే పోలింగ్ స్టేషన్లో వుండే విధంముగా చూడాలన్నారు. ఇతర ప్రాంతాలకు ఉపాధి కొరకు వెళ్లిన ఓటర్ల ను జాబితానుండి తొలగించవద్దని ఆదేశించారు. రాజకీయ ఒత్తిళ్లతో ఓటర్ల జాబితా నమోదు చేయరాదని బి.ఎల్.ఓ.లను ఆదేసించారు . ఈ కార్య క్రమమంలో అదనపు కలెక్టర్ జి వెంకటేశ్వర్లు(రెవిన్యూ), ఆర్డీవో అంబాదాస్ రాజేశ్వర్ , జిల్లా సైన్సు అధికారి రాజిరెడ్డి , తహసీల్దార్ శ్రీనివాస్ , బి ఎల్ ఓ లు, సూపర్ వైజర్ల సంబంధిత అధికారులు పాల్గొన్నారు.