Tuesday , July 16 2024

టి ఏ జె ఎఫ్ రాష్ట్రస్థాయి సమావేశం ఏర్పాటుచేసిన డాక్టర్ తనుగుల జితేందర్ 

 తెలంగాణ కెరటం ఉమ్మడి వెల్దుర్తి మండలం ప్రతినిధి ఆగస్టు

టీఏజేఎఫ్ రాష్ట్రస్థాయి సమావేశం హైదరాబాదులోని ఓ ప్రముఖ హోటల్లోనిర్వహించారు.ఈ కార్యక్రమానికి తెలంగాణలోని వివిధ జిల్లాల నుండి అధిక సంఖ్యలో వర్కింగ్ జర్నలిస్టులో పాల్గొన్నారు. అదేవిధంగా టీఏ జేఎఫ్ రాష్ట్ర కమిటీ చైర్మన్ డాక్టర్ తనుగుల జితేందర్ రావు, ముఖ్య అతిథులుగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తనయుడు పివి ప్రభాకర్ రావు, డైరెక్టర్ ఫైనాన్స్& కమర్షియల్, టీఎస్ జన్ కో డాక్టర్ టి. ఆర్. కె రావు. వి ఆర్ ఎస్, తెలంగాణ ఆల్ జర్నలిస్ట్  చాంబర్స్  కమిటీ ప్రెసిడెంట్ పింగాలి వెంకటేశ్వరరావు, పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కులకై అనునిత్యం జర్నలిస్టుల తరఫున పోరాటానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అనునిత్యం ప్రజల పక్షాన నిలబడుతూ ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వ నడకను ఒడుదుడుగులను ఎత్తిచూపటమే కాకుండా ప్రతినిత్యం ప్రజల పక్షాన నిలబడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల, నియోజకవర్గాల  అధ్యక్షులు మధుసూదనా చారి, మహబూబ్ షేక్, నరేష్, దత్తాత్రేయ, సంగీత, ప్రవీణ, శేఖర్, యాదమ్మ, చంద్రకళ, ఇతర జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.