Sunday , May 26 2024

వాహనాల తనిఖీల్లో 54 వేల పట్టివేత సీజ్

తెలంగాణ కెరటం చేర్యాల ప్రతినిధి మే 04 :

ఎలాంటి ఆధారాలు లేకుండా కారులో తరలిస్తున్న నగదును పట్టుకొని సీజ్ చేసినట్లు చేర్యాల సిఐ ఎల్ శీను, ఎస్సై దామోదర్ తెలిపారు. శనివారం చేర్యాల సిఐ శ్రీను, ఎస్ఐ దామోదర్ పోలీస్ సిబ్బందితో కలసి
గుర్జకుంట వాగు చౌరస్తా వద్ద సర్ప్రైజ్ వాహనాలను తనిఖీ చేస్తుండగా ఉమ్మడి మద్దూరు మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన బుక్య సురేష్, హనుమంతు తాండ తన కారులో ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న 54 వేల రూపాయలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా చేర్యాల సిఐ శ్రీను మాట్లాడుతూ.. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు లోక్ సభ ఎన్నికల సందర్భంగా సర్ప్రైజ్ వాహనాల తనిఖీ నిర్వహించడం జరుగుతుందన్నారు. 50 వేల కంటే ఎక్కువ డబ్బులు తీసుకొని వెళ్లేటప్పుడు వాటికి సంబంధించిన పత్రాలు దగ్గర ఉంచుకోవాలని సూచించారు.