తెలంగాణ కెరటం మర్కుక్ మండల ప్రతినిధి ఫిబ్రవరి 17,
తెలంగాణ జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినం సందర్భంగా శనివారం రోజు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మర్కుక్ రంగనాయక స్వామి దేవాలయం లో ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం కేక్ కటింగ్ చేశారు.మరియు మర్కుక్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో రక్త దాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మర్కుక్ మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, ఎంపీపీ పాండు గౌడ్,జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం,వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి,ఎంపీటీసీ ల ఫోరం అధ్యక్షుడు కృష్ణ యాదవ్, ఎంపీటీసీ లు,వంటి మామిడి మార్కేట్ కమిటీ మాజీ డైరెక్టర్ రాందాస్ గౌడ్, వివిధ గ్రామాల మాజీ సర్పంచ్ లు ,గ్రామ శాఖ అధ్యక్షులు,బి ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు యువకులు తదితరులు పాల్గొన్నారు.