రాష్ట్ర మంత్రి కొండా సురేఖ.
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి ఏప్రిల్ 19:
కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నీలం మధు ముదిరాజ్ నామినేషన్ కు ముఖ్యమంత్రి హాజరు కావడం జరుగుతుందని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ శుక్రవారం స్పష్టం చేశారు. హెలిప్యాడ్ సిద్ధం చేశాము. రాందాస్ చౌరస్తా వరకు ర్యాలీ కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేస్తాం. లేదంటే రెండు కిలో మీటర్ల దూరం నుంచి బైక్ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. రోహిత్ నాయకత్వంలో కార్యక్రమం కొనసాగుతుంది. జనసమీకరణ కోసం ఆదేశాలు ఇచ్చాం.మెదక్ ప్రసిద్ది గాంచిన నియోజకవర్గం.ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన చరిత్ర ఉంది. కాంగ్రెస్ జెండా ఎగురవే యడానికి,కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలి. నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేస్తాం. నేడు జరిగే సభ గెలుపు పై ప్రభావం ఉంటుంది. భారీ బహిరంగ సభ ఉంటుంది.
మైనంపల్లి..
బీసీ ముద్దు బిడ్డ మదు నామినేషన్ కు సీఎం మెదక్ వస్తున్నారు. ప్రతీ ఒక్కరూ సభను విజయవంతం చేయాలి.బీసీల ఐక్యత చాటుకోవాల్సిన అవసరం ఉంది.ఎన్టీఆర్,ఇందిరాగాంధీ తప్ప బీసీ లను పట్టించుకున్న నాధులు లేరు.ముదిరాజ్ కుటుంబ సభ్యుల మెజార్టీ ఉంటది..ఈసారి మీ సత్తా చాటుకునే అవసరం ఉంది. పంచాయతీ మెంబర్ నుంచి జెడ్పీటీసీ వరకు వచ్చి ఓటమి పాలయ్యారు.ఎంపి గా గెలిపించాలి. మదు వందల కోట్ల సర్వీస్ చేయడం జరిగింది. రాజకీయం అంటే ఒక బిజినెస్ అయింది.అమాయక ప్రజలను 2వేలకు కొంటున్నారు. ఐదేళ్లు రాజకీయాన్ని వ్యాపారం చేస్తున్నారు.గత ప్రభుత్వం లక్షల కోట్లకు పడగేతారు.20 ఏళ్ల క్రితం ఏమీ లేకుండే.. ఇప్పుడు రాజు పిల్లలుగా ఉన్నారు.ఓడిపోతే మింగుడుత లేదు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ప్రజలు ఓటేసి గెలిపించారు ఐదేళ్లలో అద్భుతాలు చేసి చూపిస్తాం. బీఆర్ ఎస్ లో నాయకులకు గౌరవం లేదు. నాయకులు డిప్రెషన్ లో ఉండే.ప్రజలు బుద్ది చెప్పారు.సర్వే రిపోర్టులోనూ నీలం మధుకు అనుకూలంగా ఉంది.రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదు. పథకాలు అమలు చేస్తాం. కేసీఆర్ అవినీతి చిట్టా విప్పుతాము.అందరికీ న్యాయం చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కేంద్రంలో కాంగ్రెస్ వస్తుంది. బిజీ గ్రాఫ్ పడిపోతుంది. దేవుళ్ళ తో రాజకీయం చేస్తే మటాష్ అవుతారు.అన్ని మతాలను కాపాడే ఏకైక పార్టీ కాంగ్రెస్. కులాలు, మతాలకు అతీతంగా అందరినీ కలుపుకుని పోతామన్నారు.