Saturday , October 12 2024

కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి

 పార్టీ శ్రేణుల్లో సంబురాలు

తెలంగాణ కెరటం,జనగామ ప్రధాన ప్రతినిధి, ఆగష్టు10:

కొమూరి ప్రతాప్రెడ్డి

ఊరు : నర్సాయపల్లి

పుట్టిన తేదీ : 1958 జనవరి 2

విద్యార్హతలు: ఎంఏ, ఎల్ఎల్బీ (సెక్రటేరియ అసిస్టెంట్ సెక్రటరీ, జీఏడీ ఉద్యోగం నుంచి వీఆర్ఎస్ తీసుకున్న తర్వాత, అగ్రిక ల్చర్, సోషల్ సర్వీస్, బిల్డింగ్ అడ్వైజర్గా సేవలందించారు.

ఎమ్మెల్యే : ఒకసారి

భార్య : అరుణ

పిల్లల : ఇద్దరు కుమారులు, కూతురు

 కాంగ్రెస్ పార్టీ జిల్లా. అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ మెంబర్ కొమ్మూరి నియమిస్తూ బుధవారం రాత్రి ఏఐసీసీ ఉత్త ర్వులు జారీ చేసింది. గతంలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన జంగా రాఘవరెడ్డి, వరంగల్ పశ్చిమకు వెళ్లడంతో.. ఇక్కడ ఖాళీ అయింది. నాలుగు నెలల ఉత్కంఠతకు తెర దింపుతూ కొమ్మూరిని జిల్లా అధ్యక్షుడిగా ప్రకటిస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ ఆర్డర్ కాపీ ఇచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రతిపాదనలు పంపించిన రెండు గంటల్లోనే ఏఐసీసీ నుంచి జిల్లా అధ్యక్షుడి నియామక ఉత్తర్వు లు వెలువడ్డాయి. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో సంతో షం వెల్లివిరుస్తోంది. 2018 నవంబర్ లో కాంగ్రెస్ పార్టీలో చేరిన కొమ్మూరి.. 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా నుంచి

పోటీ చేశారు. గత ఏడాది టీపీసీసీ మెంబర్ బాధ్యతలు చేపట్టిన ఆయన.. జనగామ నియోజక వర్గంలో పార్టీ అభివృద్ధి విషయంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం జిల్లా అధ్యక్ష పదవి రావడంతో.. ఆయనపై మూడు అసెంబ్లీ నియోజక వర్గాల బాధ్యత పెరిగింది. తన నియామకానికి సంహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రతాప్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.