పొలం వద్ద తెగిపోయిన కరెంటు వైర్ గమనించక రైతు కాలుపెట్టగా మృతి.
మెదక్ జిల్లా నిజాంపేటలో సంఘటన.
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి మార్చి 17:
మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రానికి చెందిన మల్లేశం (48) అనే రైతు తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి కరెంటు వైరు పొలంలో పడగా దాన్ని చూడక రైతు వెళ్లి కాలు పెట్టాడు. వెంటనే అక్కడనే పొలంలో పడి మృతి చెందాడు. నిజాంపేట గ్రామానికి చెందిన మల్లేశం ప్రతిరోజు లాగే పొలం వద్దకు వెళ్లడం జరిగింది. రాత్రి ఈదురు గాలులు వాన రావడం వల్ల గాలి దుమారానికి 11 కేవీ వైరు తెగి పొలం లో పడింది. దాన్ని గమనించక రైతు కాలు వైరుకు తగలగా బక్కోళ్ల మల్లేశం అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపారు. ఈ విషయాన్ని విద్యుత్తు అధికారులతో పాటు, నిజాంపేట పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.