Tuesday , July 16 2024

ఉరి వేసుకుని రైతు ఆత్మహత్య.

తెలంగాణ కెరటం నాగర్కర్నూల్ జిల్లా ప్రతినిధి (ఆగస్టు

నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం గంగారం పెద్దముళ్ల తాండకు చెందిన మూడవ రాజు 38 శుక్రవారం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లాలో చోటుచేసుకుంది. గ్రామస్తులతో గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గత కొంతకాలంగా రుణం కోసం బ్యాంకు చుట్టూ తిరగాడని పాత బాకీ చెల్లిస్తేనే తిరిగి రుణం ఇస్తామని బ్యాంక్ అధికారులు చెప్పడంతో తిరిగి తిరిగి విసుకు చెంది మనస్థాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం రైతుకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రుణమాఫీ ప్రకటించిన బ్యాంకు అధికారులు ఇలా పాత బకాయిలు వడ్డీతో సహా చెల్లించాలని రైతులపై  వత్తిడి చేయడం సమంజసం కాదని, చనిపోయిన రైతు ప్రాణాన్ని తిరిగి తీసుకు రాగలరా అని ప్రశ్నించారు. రాజు మృతితో ఆ కుటుంబం వీధిన పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.