Tuesday , July 16 2024

ఉపాధి హామీ పథకంలో పనిచేసే సంవత్సరాలు గడుస్తున్న కూలీలకు రూపాయి అందని నయా పైసా.

_డిబిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు

తెలంగాణ కెరటం: రాయపోల్ ప్రతినిధి:ఫిబ్రవరి 21

ఉపాధి హామీ పథకంలో సంవత్సరం,రెండు సంవత్సరాల క్రితం పనిచేసిన కూలీలకు రూపాయి అందని నగ పైసా అని దళిత బహుజన ఫ్రంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు అన్నారు.ఈ సందర్భంగా బ్యాగరి వేణు మాట్లాడుతూ బుధవారం నాడు రాయపోల్ మండల్, పెద్దాఅరేపల్లె, రాంసాగర్,కొత్తపల్లి వివిధ గ్రామాల్లో ఉపాధి హామీ పని నడుస్తున్న చోటికి బ్యాగరి వేణు వెళ్లిన సందర్భంగా కూలీలు ఎండకు ఎండి చేతులకు పోక్కులు వచ్చేటట్టు చేసిన పనులకు సంవత్సరాలు గడుస్తున్న వేతనాలు రాలేదని కూలీల కోసలను వేణు కు వెల్లరించారు.ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ పెద్దఅరేపల్లిలో రెండు సంవత్సరాల క్రితం ఏడు వారాలు 50 మంది కూలీలు చెరువులో పనిచేస్తే ఇదివరకు కొంత మంది కూలీలకు ఇదివరకు వేతనాలు అందలేదన్నారు, అలాగే రాంసాగర్ లో సంవత్సరం కింద దండు ఆంజనేయులు, సత్యనారాయణ,ముత్యాలు సంవత్సరం క్రితం చెరువులో పనిచేసిన పైసలు రాలేదని అన్నారు,అలాగే కొత్తపల్లిలో కూడా సంవత్సరం కింద చేసిన డబ్బులు కూలీలకు అందలేదన్నారు, ప్రస్తుతం
ఈ సంవత్సరంలో కొత్తపల్లిలో ఆరువారాల నుండి 40 నుండి 50 మంది కూలీలు చేస్తున్న వారికి డబ్బులు రాలేదన్నారు.కూలీలతో మాట్లాడిన అనంతరం దళిత బహుజన ఫ్రంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు రాయపోల్ ఎంపీడీవో కార్యాలయానికి వెళ్ళాడు వెళ్లిన సమయానికి ఎంపీడీవో గారు లేకపోవడంతో ఆ కార్యాలయంలో ఉండే టెక్నికల్ అసిస్టెంట్ గారితో కూలీలు చెప్పిన విధంగా అడిగితే సంవత్సరం రెండు సంవత్సరాల పెండింగ్ డబ్బులు ఏవి లేవని అధికారి చెప్పారని అన్నారు,కూలీలేము మాకు డబ్బులు రాలేదని కూలీలు ఆవేదన కార్యాలయంలో పెండింగ్ డబ్బులు ఏం లేవని చెప్తున్నా అధికారులు.చేసిన పైసలు రాక మళ్ళీ ఉపాధి హామీ పనికి రావాలంటే నిరాహారకు గురవుతున్న కూలీలు.రాయపోల్ ఎంపీడీవో గారికి డిమాండ్ గా విజ్ఞప్తిగా అడిగేది కూలీల తరఫున కూలీలు చెప్పిన విధంగా సంవత్సరం రెండు సంవత్సరాల డబ్బులు పెండింగ్లో ఉన్న డబ్బులు కూలీల ఖాతాలోని వెంటనే చెల్లించాలని కూలీల తరఫున డిమాండ్ చేశాడు.