తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (ఏప్రిల్ 19):
నాగర్ కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంకు
ముఖ్య అతిథిగా
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచ్చేస్తున్నారని, డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ
ఈనెల 23న నాగర్కర్నూల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ మల్లు రవి నామినేషన్ వేనున్నారని ఈ కార్యక్రమానికి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారని అన్నారు. అనంతరం నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలో సాయంత్రం 4:00లకు
బిజినపల్లి మండల కేంద్రంలో
భారీ బహిరంగ నిర్వహించనున్నట్లు ఇట్టి బహిరంగ సభకు నాగర్ కర్నూల్ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వారి బహిరంగ సభ ను విజయవంతం చేయగలరని పిలుపునిచ్చారు.