Saturday , October 12 2024

ఇవిఎంలను రద్దు చేసి బ్యాలెట్ ఎన్నికలు నిర్వహించాలి

 తెలంగాణ కెరటం ముంబై మహారాష్ట్ర ప్రతినిధి ఆగస్టు

మోదీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాల వల్ల జనంలో తీవ్ర అసంతృప్తి నెలకొందని భారతీయ రక్షక అఘాడి చే శుక్రవారం ముంబై మరాఠీ పత్రకార్ సంగ్ లో ప్రెస్ మీట్ జర్పారు. అఘాడి చీఫ్ భీంపుత్ర టెక్సాస్ గైక్వాడ్ మాట్లాడుతూ ప్రభుత్వపు పరిశ్రమలన్నింటినీ అదానీకి చౌకగా అమ్మడం ద్వారా యువత పురోగమనానికి మార్గం మూసుకు పోయింది. ప్రభుత్వ సంస్థలను విక్రయించే కొనుగోలు చేసే వారిపై ఎస్సీ ఎస్టి అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలి. మణిపూర్‌లో ఆదివాసీ స్త్రీలను వివస్త్రను చేసి సామూహిక రేప్ పై మౌనం వహించిన రాష్ట్ర సీఎం, దేశ పిఎం తీరును ఖండిస్తున్నాం. అక్కడ తక్షణమే రాష్ట్రపతి పాలన విధించేలా ఆదేశాలు జారీ చేయాలి. మతం పేరుతో ఓట్లు అడిగే అభ్యర్థుల అభ్యర్థిత్వాన్ని వెంటనే రద్దు చేయాలి. బ్రాహ్మణుల ఆర్.ఎస్.ఎస్ చట్టబద్ధంగా నమోదు చేయబడిన సంస్థ కాదు. దాని వద్ద భారీగా నల్లధనం, అక్రమ ఆస్తులు ఉన్నాయి. వాటి ద్వారా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగిస్తుంది. ఐతే వారి ఆస్తులన్నీ జప్తు చేసి కూలీలు, రైతుల సంక్షేమం, పిల్లల విద్య కోసం వినియోగించేలా చేయాలి. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఇవిఎం హరిస్తుంది, దానిని రద్దు చేసి బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికల్ని నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. పుల్వామా ఉగ్రదాడిలో 40మంది జవాన్లను హతమార్చడానికి రక్షణ శాఖ కారణమని సత్యపాల్ మాలిక్  సమాచారాన్ని అందించారు. వాటిపై ఎన్క్వయారీ పెట్టాలన్న డిమాండ్లతో దేశ రాష్ట్రపతి, ఎన్నికల కమిషన్, న్యాయమూర్తి చంద్రచూడ్ కు నివేదిక పంపనున్నారు. వీటినే ఆధారం చేసుకుని 16 ఆగస్టున ముంబైలోని ఆజాద్ మైదానంలో భారీ ప్రదర్శన నిర్వహించ నున్నామని గైక్వాడ్ పిలుపునిచ్చారు.