Friday , November 15 2024

అకాల వర్షంతో అన్నదాత అతలాకుతలం

తడిసిన వారి ధాన్యం, నేలరాలిన మామిడికాయలు.

ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల విజ్ఞప్తి.

తెలంగాణ కెరటం హుస్నాబాద్ ప్రజలది ఏప్రిల్ 19

హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. దీనితో రైతులు ఆరబోసుకున్న వరి ధాన్యం తడిసి ముద్దయింది ఒకపక్క మామిడి తోటలోని మామిడికాయలు నేలరాలి తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు శుక్రవారం హుస్నాబాద్ మరియు పరిసర గ్రామాలైన మిర్జాపూర్ పోతారం తదితర గ్రామాలలోని రైతులు వారి పంట ధాన్యం ఎండకు ఆరబోసుకున్న తరుణంలో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఎదురుగాలులతో కూడిన భారీ వర్షం రావడంతో రైతులు ఉలిక్కిపడ్డారు చేతికొచ్చిన వరి ధాన్యం తడిసి ముద్దవ్వడంతో తీవ్ర నష్టం వాటిలిందని అదేవిధంగా చేతికొచ్చిన మామిడి తోటలోని మామిడికాయలు నేల రాలడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని కాబట్టి ప్రభుత్వ అధికారులు వెంటనే నష్టపోయిన పంటలను పరిశీలించి నష్టపరిహారం చెల్లించాలని రైతులు విజ్ఞప్తి చేశారు.