- కామారెడ్డి లో కెసిఆర్ ఓటమికి పరిష్కారాలు ఇప్పటికీ దొరకలేదు.
- ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా జహీరాబాద్ బారాసా అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 13 (తెలంగాణ కెరటం)
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల మున్సిపాలిటీలో ఏడు వీలీన గ్రామాల బారాస పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా జహీరాబాద్ పార్లమెంట్ బారాసా అభ్యర్థి గాలి అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామారెడ్డి ప్రజలు నన్ను ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతోనే గెలిపిస్తే నేను అభివృద్ధి చేసి చూపెడతానని అన్నారు. నేను రైతు బిడ్డను, తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేసిన ఫలితమే జహీరాబాద్ పార్లమెంటరీ టికెట్ నాకు దొరకడం జరిగిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేక అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, తెలంగాణ రాష్ట్రంలో బారాస మెజార్టీ స్థానాలు గెలుచుకొని కేంద్రంలో మన సత్తా చాటాలని అన్నారు. కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు కాదు 420 అబద్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి సంతకం రెండు లక్షల రుణమాఫీ పైన సంతకం పెడతానని మాట ఇచ్చి తప్పారని అన్నారు. ఇప్పటికీ రైతుబంధు పూర్తిస్థాయిలో రాలేకపోయిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎకరాకు 15000 ఇస్తామని చెప్పి ఇప్పుడేమో 10,000 రూపాయలు ఇస్తుందని అన్నారు. తెలంగాణలో ఆరు గ్యారంటీల అమలు చేయడం సాధ్యం కాలేకపోయిందని, మహిళలకు ఫ్రీ బస్సు ఒకటి మాత్రమే అమలు చేసిందని, అవసరం లేని పనికిరాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజల మీద ఎంత భారం మోపుతుందో ప్రజలే గమనించాలని గుర్తు చేశారు. కామారెడ్డి నుండి పోటీ చేసిన కేసీఆర్ ఎలా ఓడిపోయారో అంతు పట్టని రహస్యంగా ఉందని వారు అన్నారు. జహీరాబాద్ నియోజకవర్గం టిఆర్ఎస్ జండా ఎగరాలని కార్యకర్తలకు పిలుపును ఇచ్చారు. ప్రతి ఒక్క కార్యకర్త తమ వంతు బాధ్యతగా పట్టుదలతో జహీరాబాద్ సీటు గెలుచుకోవడం కోసం పూర్తిస్థాయిలో పని చేయాలని సూచించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ కామారెడ్డి నియోజకవర్గం నుండి భారత రాష్ట్ర సమితికి అధిక మెజార్టీ ఇవ్వాలని పార్టీ కార్యకర్తలను కోరారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో కామారెడ్డి ఎంపీపీ ఆంజనేయులు, అధికార ప్రతినిధి గైని శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.