తెలంగాణ కెరటం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి ఆగస్ట్
తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టి వనిత
అంగన్వాడీ టీచర్స్ ని ఎం డి ఏ సర్వే నుండి మినహాయించాలని, కోరుతూ తెలంగాణ అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సి ఐ టి యు) ఆధ్వర్యంలో డి డబ్ల్యు సావిత్రి మేడం గారికి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టి వనిత మాట్లాడుతూ , అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలుగా, కొనసాగుతున్నాయని జాబ్ చార్ట్ ప్రకారం మేం విధులు నిర్వహిస్తున్నామని ,కానీ ఈ నెల 10 నుండి 25వ తేదీ వరకు ఎంఏ ఎం డి ఏ .సర్వే చేయాలని టీచర్లపై అధికారులు ఒత్తిడి తీసుకు వస్తున్నారు అనారోగ్య సమస్యలు ఉన్నవారిని కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు కనుక మెడికల్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన పనిని మాతో చేపించి ప్రయత్నం చేస్తున్నారు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారము పోషణ్ ట్రాకర్ మరియు ఎన్ హెచ్ టి ఎస్. రెండు యూపులలో సర్వే చేసి ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలి పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలుగా ఉండి ఆరోగ్య లక్ష్మి సేవలు .పిల్లల పెరుగుదల పర్యవేక్షణలతో .పాటు శాఖ పరంగా ఇచ్చే అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ఇప్పటికే అనేకమంది టీచర్లు అనారోగ్యాలతో ఉన్నరు వయసు పైబడి ఉన్నారు అంగన్వాడీ పనులు చేయటమే ఇబ్బందికరంగా ఉంటే ఒకపక్క అంగన్వాడికి ఐసిడిఎస్ కు శిశు సంక్షేమ శాఖకు సంబంధం లేని పనులు సేవా పేరుతో. బిఎల్ఓ పేరుతో ఇప్పుడు ఎం డి ఏ సర్వే పేరుతో మెడికల్ డిపార్ట్మెంట్ మా ఈసెంటర్లకు దూరం చేస్తూ మా బెనిఫిషర్స్ కి అన్యాయం జరుగుతోంది కనుక ఈ ఎం డి ఏ సర్వే నుండి బిఎల్ఓ డ్యూటీ ల నుండి అంగన్వాడీలను మినహాయించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకపక్క అనేక సమస్యలతో అంగన్వాడీ టీచర్లు ఇబ్బందులు పడతా ఉంటే అవేవీ పట్టించుకోని ప్రభుత్వాలు అదన పనులు చెప్పి ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు కనుక ఇప్పటికైనా శాఖాపరమైన పనులు తప్ప ఇతర పనులు ఏవి అప్పగించకూడదని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ముంజం శ్రీనివాస్ ప్రాజెక్టు నాయకురాలు సువర్ణ పాల్గొన్నారు.